Saturday 30 June 2018

Cabage, Apple Salad



Search Tags : Salads, nutrition food, vanta-varpu
Continue Reading...

Brown Rice Risotto (Nutrition Vantalu)


Continue Reading...

Baby Corn Palak


Continue Reading...

Saturday 25 November 2017

Yoga Sadhana యోగీరాజ్‌ శ్రీశ్రీశ్రీ రామలాల్‌ మహాప్రభూజీ వారిచే రచించబడిన 'యోగ సాధన'

యోగీరాజ్‌ శ్రీశ్రీశ్రీ రామలాల్‌ మహాప్రభూజీ 

శ్రీ గణేశాయ నమః

ఈ శ్లోకములు సంస్కృతమునందు యోగీరాజ్‌ శ్రీశ్రీశ్రీ రామలాల్‌ మహాప్రభువు స్వహస్తములతో లిఖించబడినది. దానిని యోగిరాజ్‌ శ్రీచంద్రమోహన్‌జీ మహరాజ్‌ వారిచే హిందీ మూలమునకు అనువదింపబడినవి. తదనంతరం శ్రీమతి టి. పద్మజ అను భక్తురాలు తెలుగులో అనువాదము చేసారు. ఆ తరువాత ఈ క్రింద శ్లోకాలను, వాటి అర్థాలను ''యోగ సాధన'' పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది.

ఈ శ్లోకములలో, యోగికి ఏమేమి శక్తులు ఉంటాయి? యోగ విద్యలకు మరియు యితర విద్యలకి మధ్య భేదము ఏమిటి? యిటువంటి విషయములయొక్క పూర్తి రూపాన్ని వర్ణన చేయటం జరిగింది. విహిత విధానాలను అనుసరించి పవనాభ్యాసము చేసెడి యోగి ముల్లోకాలలో పూజనీయుడు అవుతాడు. మరియు అతనికి సకల యోగ సిద్ధులు అనగా అణువణువునా ఐశ్వర్యము పూర్ణరూపములో ప్రాప్తిస్తుంది.
 


1.    కైలాస శిఖరే రమ్యే గౌరీ పృచ్ఛతి శంకరమ్‌|
      గుహ్యాద గుహ్యాంతరం గుహ్యం కధయస్వ మహేశ్వరః||


తా||    పవిత్ర కైలాస శిఖరము మీద శ్రీ పార్వతీదేవి శంకరుని అడుగుచున్నది. - ''నాకు మీరు గూఢాతిగూఢమైన      జ్ఞానమును ఉపదేశించండి.''

2.    కైలాసే శోభనతీరే ఉమా పృచ్ఛతి శంకరమ్‌|
      అత్యంత సుగమం హ్యాశుముక్తిం కధయమే ప్రభో||


తా||    అతి శోభాయమానమైన కైలాస పర్వతము మీద భగవతి ఉమ, భగవంతుడు శంకరునితో అడుగుచున్నది. ''శీఘ్రముగా ముక్తిని యిచ్చే విషయమును గురించి నాకు తెలుపండి.''

3.    కైలాసేతి శుభే శైలే గౌరీ పృచ్ఛతి శంకరమ్‌|
    ముక్తిమార్గంతు మే బ్రూహి శీఘ్ర సిద్ధికరం ప్రభో||


తా||    అతిశోభిత కైలాసము మీద జగదంబ గౌరి, శంకర భగవానుని యిలా అడుగుచున్నది. ''శీఘ్రసిద్ధిదాతా! ముక్తి మార్గమును నాకు మీరు తెలియజేయండి.

4.    ముక్తస్వానుభవం విద్ధి శీఘ్రం ముత్తస్తు పార్వతి|
       సద్‌జ్ఞానేన భవేన్ముక్తి పాపినామపి సాధికే||


తా||    శంకర భగవానుడు చెప్పుచున్నాడు. ''హే! పార్వతీ! సద్‌జ్ఞానము ద్వారా పాపులకు కూడా ముక్తి కలుగుతుంది.''

5.    ఇదానీం కథయిష్యామి ముక్తస్వానుభవం ప్రియే|
       యజ్ఞాత్వా లభతే ముక్తిం పాప యుక్తోపి సాధకః||


తా||    శంకర భగవానులు చెప్పుచున్నారు. ''హే! ప్రియే, నీకు యిప్పుడు నేను ముక్త్యనుభవం గురించి చెపుతాను. దానిని తెలుసుకున్న పాపి కూడా సాధకుడు ఐనచో ముక్తిని పొందగలడు.''

6.    సత్యం కేచిత్‌ ప్రశంసంతి తపః శౌచం తథాపరే|
       క్షమాం కేచిత్‌ ప్రశంసన్తి తధైవ సమ ఆర్జనమ్‌||


తా||    ముక్తికొరకు కొందరు సత్యాన్ని ప్రశంసిస్తారు. కొందరు తపము, పవిత్రత, దయ, సమభావము ఋజువర్తనమైన నడవడికతో వుండటం అని చెపుతారు.

7.    కేచిద్దానం ప్రశంసన్తి శ్రాద్ధకర్మ తథాపరే|
       శం సన్త్యుపాసనాం కేచిత్‌ కేచిత్‌ వైరాగ్యముత్తమమ్‌||


తా||    కొందరు దానము, శ్రాద్ధకర్మ, ఉపాసన మరియు వైరాగ్యములను ఉత్తమమని చెపుతారు.

8.    మంత్రయోగం ప్రశంసంతి కేచిత్తీర్థామసేవనమ్‌|
       ఏవం బపలానుసాయాంస్తు ప్రవదన్తి విముక్తయే||


తా||    కొందరు మంత్రయోగము, తీర్థసేవనము మొదలగు వివిధ ఉపాయములను ముక్తి కొరకు చెప్పుతుంటారు.

9.    ఏవం వ్యవస్థితాలోకే కృత్యాకృత్య విదోజనాః|
       వ్యామోహయేవ గచ్ఛన్తి విముక్తాః పాపకర్మాభిః||


తా||    ఈ ప్రకారముగా నానా విధములైన పద్ధతులను గ్రహించిన వ్యక్తి పాపకర్మల నుండి విముక్తుడు ఐనప్పటికీ మోహములోనే పడిపోవుచున్నాడు.

10.    ఏతన్‌ మతావలంబీ యో లబ్ధ్వా దుఃఖాని పుణ్యకే|
       భ్రమతీత్యవశః సోత్ర జన్మమృత్యు పరంపరామ్‌||


తా||    ఈ ప్రకారమైన పద్ధతులను అవలంబించి మనుష్యులు పుణ్యమొస్తుందనే భ్రమకు వివశుడై, జన్మమృత్యు చక్రములో పడి దుఃఖాన్నే పొందుతున్నాడు.

11.    ఏతేచాన్యేచ మునిభిః సంజ్ఞా భేదాత్‌ పృధ్‌గ్‌విధా
        మతాః శాస్త్రేషు కధితాః లోకవ్యామోహకారకాః||


తా||    అనేక మందులు, యింకా అనేక శాస్త్ర పద్ధతులు, సంశయాలు కలిగేటట్లు చెప్పి లోకంలో వ్యామోహాలు కలిగించారు.

12.    ఏతత్‌ వివాద శీలానాం మతం వక్తుం నశక్యతే|
         భ్రమం త్యస్సిమన్‌ జనాః సర్వేముక్తిమార్గే బహిష్కృతాః||


తా||    యిటువంటి సిద్ధాంత వివాదములలో పడిన వ్యక్తులు అశక్తులై, ముక్తిమార్గాన్ని వదిలేసి భ్రమలో పడుతున్నారు.

13.    యస్మిన్‌ జ్ఞాతే సర్వమిదం జ్ఞాతం భవతి నిశ్చితమ్‌|
        తస్మిన్‌ పరిశ్రమః కార్యః కిమన్యచ్ఛాస్త్ర భాషితమ్‌||


తా||    శాస్త్రాల్లోని అనేక విచారకాలలోని సారాంశం ఏదైతే తెలుసుకోవటం వలన, సర్వం తెలుసుకోగలుగుతామో దాని ఆచరణలో ప్రయత్నించడం సర్వదా శ్రేయస్కరం.

14.    యోగశాస్త్రమిదం గోప్యం అస్మాభిః పరిభాషితమ్‌|
         సభక్తాయ ప్రదాతవ్యం త్రైలోక్యేచ మహాత్మనే||


తా||    శివ భగవానులు యిలా చెప్పుచున్నారు. ''మాతో ప్రవచించబడిన ఈ యోగశాస్త్రము పరమ గోప్యమైనది (రహస్యమైనది). ముల్లోకాలలో పవిత్ర ఆలోచనలతో వుండే సద్భక్తులైన మహాత్ములకు ఈ శాస్త్రము తెలియచేయవలెను.''

15.    న స్థిరం క్షణమష్యేకం ఉదకంచ యధోర్మిభిః|
        వాతాహతం తధా చిత్తం తస్మాత్తస్యన విశ్వసేత్‌||


తా||    గాలివలన చలించబడే నీరు క్షణమైనా ఏ ప్రకారముగా ఐతే స్థిరత్వము పొందలేదో, అదే ప్రకారం మనస్సు కూడా చంచలమైనది, దానిని ఎప్పుడూ విశ్వసించకూడదు.

16.    అప్యబ్ధి పానాన్మహతః సుమేరున్మూల నాదపి|
    అపి వన్హ్యశనాత్‌ సాధో! విషమశ్చిత్త నిగ్రహః||


తా||    సముద్రాన్ని త్రాగవచ్చు, సుమేరు పర్వతాన్ని పెకలించవచ్చు, అగ్నిని పానము చేయవచ్చు కానీ ఓ సాధూ!    చిత్తాన్ని నిగ్రహించటం చాలా కఠినమైనది.

17.    ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే|
        తదస్యహరిత ప్రజ్ఞాం వాయుశ్వినావమివామ్భసి||


తా||    ఏ ప్రకారముగానైతే గాలి, నీటిలోని నావను కదిలింప చేస్తూ స్థిరంగా వుండనివ్వదో, అదే విధంగా ఇంద్రియాలను అనుసరించే మనస్సు, బుద్ధిని హరింప చేస్తుంది.

18.    యథా నిరిన్ధనోం దీప్య స్వయమేవోప శామ్యతి|
         తథా వృత్తిక్షయాచ్చితం స్వయమేవోప శామ్యతి|


తా||    ఏ ప్రకారముగానైతే నూనె, వత్తి మొదలైనవి అయిపోయినప్పుడు దీపము దానంతట అదే ఆరిపోతుందో, అదే విధంగా వృత్తులు (ఆలోచనలు) క్షయమైనప్పుడు చిత్తము స్వయముగా శాంతమవుతుంది.

19.    ద్వివిధః కర్మకాండః స్యాత్‌ నిషేధ్‌ విధిపూర్వకః|
         నిషిద్ధకర్మకరణే పాపం భవతి నిశ్చితమ్‌||

తా||    రెండు విధములైన కర్మకాండలు నిషేదింపబడినవి నిషిద్ధ (చేయకూడని) కర్మలు (పనులు) చేయుటవలన పాపం కలగటం తథ్యం. అట్లే విహిత (మంచి) కర్మలు (పనులు) చేయుట వలన పుణ్యము లభిస్తుంది. (జీవునికి, జీవన్ముక్తి పొందవలెననిన ఈ రెండునూ నిషేధమైనవే)

20.    పుణ్యకర్మణి వై స్వర్గోనరకః పాపకర్మణి|
        కర్మబంధమయీ సృష్టిర్నాన్యధా భవతి ధృవమ్‌||


తా||    పుణ్యకర్మల వలన స్వర్గము, పాప కర్మల వలన నరకము పొందుతారు. ఈ సృష్టిలోని కర్మలు ,      కర్మబంధమైనవి, వేరే విధముగా లేదు, యిది నిశ్చయమైనది.

21.    పాపకర్మవశా దుఃఖం పుణ్యకర్మవశాత్‌ సుఖమ్‌|
         తస్మాత్సుఖార్థీ వివిధం పుణ్యం ప్రకురుతే ధృవమ్‌||

తా||    పాపకర్మల వలన దుఃఖము, పుణ్యకర్మల వలన సుఖము లభిస్తుంది. అందువలన సుఖము కోరుకునే ప్రాణులు అన్నీ పుణ్యకర్మల వలన లేనే వుంటాయి.

22.    పాపభోగావసానే పునర్జన్మ భవేత్‌ ఖలు|
         పుణ్య భోగావసానే తు నాన్యధా భవతి ధృవమ్‌||


తా||    పాపమును, పుణ్యమును అనుభవించుట కొరకు పునర్జన్మ ప్రాప్తిస్తుంది. ఇది తథ్యము.

23.    పుణ్యస్య ఫలే మిచ్ఛన్తి పుణ్యంనుచ్ఛస్తి మానవాః|
         న పాపఫల మిచ్ఛన్తి పాపం కుర్వన్తి యత్నతః||


తా||    ఆశ్చర్యమేమిటంటే మనిషి పుణ్యఫలము ఆశిస్తాడు. కానీ పుణ్యము చేయడు. పాప ఫలమును ఆశించడు కానీ పాపము చేస్తూనే వుంటాడు.

24.    స్వర్గోపి దుఃఖ సమభోగః పరస్త్రీ దర్శనాద్‌ ధృవమ్‌|
         తతో దుఃఖ మిదం సర్వం భవేన్నాసత్యత్ర సంశయః||


తా||    స్వర్గంలో కూడా పరస్త్రీ దర్శనం వలన దుఃఖమే కలుగుతుంది. అనగా ఈ స్వర్గము మొదలైనవి అన్నియూ దుఃఖమయమైనవే!

25.    నచతీవ్రేణ తపసాన స్వాధ్యాయైర్నచేజ్యయాగతిం|
        గన్తుం ద్విజాఃశక్తాయోగాత్‌ సంప్రాప్నువన్తియామ్‌||


తా||    ఏ గతియైతే, మనిషికి యోగం ద్వారా ప్రాప్తం అవుతుందో, అది తీవ్రమైన తపస్సు, స్వాధ్యాయము మరియు యజ్ఞము మొదలైన వాటివలన ప్రాప్తించబడదు.

26.    యోగాగ్నిర్దహతి క్షిప్రమశేషం పాప పంజరమ్‌|
         ప్రసన్నం జాయతే జ్ఞానం జ్ఞానాన్నిర్వాణమృచ్ఛతి||


తా||    ఎందుకనగా యోగాగ్ని పాపపంజరాన్ని అశేషంగా త్వరగా దహిస్తుంది. దానివలన నిర్మల జ్ఞానాన్ని పొంది నిర్వాణ పదాన్ని పొందగలము.

27.    యోగాత్సంప్రాప్యతే జ్ఞానం యోగాధర్మస్య లక్షణమ్‌|
         యోగ్యపరం తపోజ్ఞేయః తస్మాద్యోగం సమభ్యసేత్‌||


తా||    యోగము వలన జ్ఞానము ప్రాప్తిస్తుంది. యోగమే ధర్మలక్షణము, యోగమే పరమ తపము. కావున యోగాభ్యాసము చేయుటకే ప్రయత్నించవలెను.

28.    ఆశ్రమేయతి వర్యస్య ముహూర్తమపి విశ్రయేత్‌|
         కింతస్యాన్యేన ధర్మేణ కృతకృత్యో-భిజాయతే||


తా||    ఏ యొక్క సిద్ధయోగి ఆశ్రమములోనైనా ఒక ముహూర్తకాలము (12 లక్షణములు) పాటు విశ్రమించినచో అతను కృతార్ధుడు అవుతాడు. అతనికి యింక అన్య ధర్మముల యొక్క చింతనతో ఏమి ప్రయోజనము?

29.    నాస్తిమాయా సమంపాపం నాస్తి యోగాత్పరం వలమ్‌|
         నాస్తి జ్ఞానాత్పరో బంధుర్నాహంకారాత్‌ పరో రిపుః||


తా||    మాయతో సమానమైన పాపము వేరేది లేదు, యోగము కంటే మించి బలమైనది ఏదీ లేదు, జ్ఞానమును మించిన బంధువు ఏదీలేదు. అహంకారము కంటే పెద్ద శత్రువు ఎవరూ వుండరు.

30.    దేహే అస్మిన్‌ వర్తతే మేరుః సప్తద్వీప సమన్వితః|
         సరితః సాగరాః శైలాః క్షేత్రాణి క్షేత్రపాలకాః||


తా||    ఈ శరీరములో సప్త ద్వీపములతో సహా, సుమేరు పర్వతము యథార్ధమై యున్నది. దానితోపాటుగా సప్త సముద్రములు, పర్వతములు, క్షేత్రములు, క్షేత్రపాలకులు కూడా వున్నారు.

31.    ఋషయో మునయః సర్వేనక్షత్రాణి గ్రహాస్తథా|
         పుణ్యతీర్థాని పీఠాని వర్తన్తే పీఠదేవతా||


తా||    ఋషులు, మునులు, నక్షత్రములు, గ్రహములు, పుణ్య తీర్థములు, పీఠములు, పీఠదేవతలు యివియే కాకుండా యింకా

32.    త్రైలోక్యేయాని భూతాని తాని సర్వాణి దేహతః|
        మేరు సంవేష్టయ సర్వత్ర వ్యవహారహః ప్రవర్తతే||


తా||    త్రిలోకముల్లో వున్న అన్ని ప్రాణులు మన దేహము లోపలే వున్నవి. సుమేరుకి నాలుగువైపుల వ్యాపించి, అస్థిత్వము కలిగివున్నది. అన్నియునూ అక్కడే అన్నిక్రియలు నడుపుచున్నవి.

33.    బ్రహ్మాదయోపి త్రిదశాః పవనాభ్యాస తత్పరాః|
    అభవన్నాన్తకో భయస్తస్మాత్‌ పవనమహ్యసేత్‌||


తా||    బ్రహ్మాది దేవతలు ఎందరున్నారో అందరూ ప్రాణాయామము అభ్యాసము చేసినవారే ప్రాణాయామము యొక్క బలముతో మనిషి కాలాన్ని జయించగలుగుతాడు. యిందువలన, మనిషి ప్రాణాయామమును తప్ప అభ్యసింపవలెను.

34.    యాదవీ వాసనా మూలా వర్తతే జీవసంగినీ|
    తాహశం వహతే జంతుః కృత్యా-కృత్య విధౌభ్రమమ్‌||


తా||    జీవుని అంతఃకరణములో, చేయదగిన, చేయకూడని కర్మల విధానములో ఎటువంటి భావనలు కల్గుతాయో అటువంటి ఫలములే ప్రాప్తమవుతాయి. యిది పూర్తిగా నిశ్చితమైనది.

35.    దేహో దేవాలయః ప్రోక్తః సజీవః కేవలః శివః|
    త్యజేదజ్ఞాన నిర్మాల్యం సో-హం భావేన పూజ్యతే||


తా||    ఈ దేహమే శివాలయము, జీవాత్మయే శివుడు. అజ్ఞాన నిర్మాల్యాన్ని విడిచిపెట్టి, సో-హం భావనతోనే ఆయనకి పూజ చేయబడుతుంది.

36.    మూలే చతుర్దళోపేతే వసాంతాక్షర సంశ్రయే|
    చతుర్భుజ ముదాంరాంగం పూర్ణచంద్ర సమప్రభమ్‌||


తా||    పీతవర్ణముతో (పసుపుపచ్చ రంగు) చతుర్దళములతో మూలాధార కమలము (గుదద్వారము నుండి నాలుగు అంగుళములపైన) కలదు. అందులో పూర్ణచంద్రుడితో సమానమైన ప్రకాశముగల చతుర్భుజుడు (గణపతి) విరాజమానుడైవున్నాడు.

37.    యం యం కామయతే చిత్తే తం తం ఫలమవాప్నుయాత్‌|
    నిరన్తనం కృతాభ్యాసాతం పశ్యతి విముక్తిదమ్‌||


తా||    ఏమేమి కోరికలు చిత్తంలో వుంటాయో ఆయా ఫలము కలుగుతాయి. ఎల్లప్పుడూ నిరంతరం ధ్యానం చేయుట వలన విముక్తి సిద్ధిస్తుంది. (ఇది మూలాధార కమలము మీద ధ్యానము చేయగా వచ్చెడి ఫలమిది.)

38.    వహిరభ్యన్తరే శ్రేష్ఠం పూజనీయం ప్రయత్నతః|
    తతః శ్రేష్ఠతరం హ్యేతత్‌ నాన్యదస్తిమతమ్‌ మమ||


తా||    మాయొక్క విచారణ ఏమనగా, ఈ ధ్యానము కంటే ఉత్తమమైన వస్తువు మరొకటి లేదు. అందువలన బాహ్యమునందు, అంతరమునందునూ కూడా ఎల్లప్పుడూ ధ్యానిస్తూ వుండవలెను.

39.    ఆత్మ సంస్థం శివం త్యక్త్వా వహిః స్థంయః సమర్చయే|
    హస్తస్థం పిణ్డముత్సుృజ్య భ్రమతే జీవితాశయా||


తా||    మన అంతఃస్థితిలో వసించే శంకర భగవానుని పూజింపక, ఎవరైతే బాహ్యపూజలు చేస్తారో, వారియొక్క స్థితి ఎటువంటిది అనగా చేతిలో వున్న ఆహారము పడేసి, అక్కడ యిక్కడ భోజనము కొరకు వెదుకుట లాంటిది.

40.    ఆత్మలింగార్చనం కుర్యాత్‌ అనాలస్యం దినే దినే|
    తస్యస్యాత్‌ సకలా సిద్ధిః నాత్ర కార్యా విచారణా||


తా||    ఏ మనిషైతే ధ్యాన నిష్టతో ఆత్మలింగమును పూజిస్తారో, అతనికి స్వల్ప కాలములోనే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి.

41.    చతుర్ముఖం చతుర్బాహుం ప్రసన్నం శుచిస్మితం|
    కమండలుధరం దేవం ధాతారం శక్తిసంయుతమ్‌||


తా||    ఎవరైతే స్వాధిష్టాన కమలములోవున్న చతుర్భుజుడైన సకల శక్తి సంపన్నుడై, ప్రసన్నవదనుడైన, కమండలం ధరించియున్న చతుర్ముఖ బ్రహ్మను ధ్యానిస్తారో

42.    యో ధ్యాయతి సదాదివ్యం స్వాధిష్టానార విన్దకమ్‌|
    తస్య కామాంగనాః సర్వా భజన్తే కామమోహితాః||


తా||    అటువంటి స్వాధిష్టాన కమలమును ధ్యానిస్తారో, వారిని కామమోహిత దేవాంగనలు కూడా గౌరవిస్తారు.

43.    వివిధం చాశృతంశాస్త్రం నిశంకోవైవదే ధృవమ్‌|
    సర్వరోగ వినిర్ముక్తో లోకోచరిత నిర్భయః||


తా||    వీరికి నాలుగు వేదముల జ్ఞానము స్వయముగా తెలియబడుతుంది. మరియు అన్ని రకముల రోగముల నుండి విముక్తి కలిగి నిర్భయముగా వుంటాడు.

44.    మణిపూరే దశదళే కన్దమధ్యాత్సముత్థతే|
    ద్వాదశాంగుల నాలేస్మిన్‌ రక్తాభేకేశరాన్వితే||


తా||    కందమూల మధ్యనుండి వచ్చిన రక్తవర్ణముతో నున్న దశ దళములతో కూడిన పన్నెండు అంగుళముల కాడగల కమలములో..

45.    వాసుదేవం జగద్యోనిం వద్యపత్ర నిభేక్షణమ్‌|
    చతుర్భుజముదారాంగం శంఖచక్రగదాభృతమ్‌||

46.    తస్మిన్‌ ధ్యానం సదాయోగీకరోతి మణిపూరకే|
    తస్యపాతాళ సిద్ధిః స్యాత్‌ నిరంతరం సుఖావహా||


తా||    శంఖ, చక్ర, గదాధారియైన వాసుదేవుని మణిపూరకములో ధ్యానించుదురో వారికి స్వయముగా పాతాళ సిద్ధి ప్రాప్తిస్తుంది. నిరంతర సుఖానుభవాన్ని పొందుతారు.

47.    ఈప్పితం చ భవేల్లోకే దుఃఖరోగ వినాశనమ్‌|
    కాలస్య వంచన చాపి పరదేహ ప్రవేశనమ్‌||


తా||    యింతే కాకుండా కోరుకున్నది జరుగుతుంది, సంపూర్ణ దుఃఖరోగ వినాశనము జరుగుతుంది. కాలాన్ని జయింపగలుగుతాడు. అతనికి పరకాయ ప్రవేశము చేయగలిగే యోగ్యత సిద్ధిస్తుంది.

48.    జాంబూనదాది కరణం సిద్ధానాం దర్శనం భవేత్‌|
    దివ్యౌషధ దర్శనం చ నిధీనాం దర్శనం భవేత్‌||


తా||    జంబు మరియు ఇతర నదుల, సిద్ధుల దర్శనం సంభవిస్తుంది. దివ్యౌషధుల దర్శనం, నిధుల దర్శనం కలుగుతుంది.

49.    అతఃపరే హ్యనాహతే పధ్నే ద్వాదశపత్రకే|
    వ్యాఘ్ర చర్మాంబరధరం శశీవ ప్రియదర్శనం||


తా||    అనాహతములో (హృదయస్థానం) ద్వాదశ (పన్నెండు దళముల కమలములో, పులిచర్మం ధరించిన శివభగవానుని దర్శిస్తాడు.

50.    పద్మాసన సమాసీనం దేవేశం గిరిజాయుతం|
         జగత్సంహార కర్తారం అనంత బల పౌరుషమ్‌||
         యో ధ్యాయతి పరం శాంతం అనంత బల పౌరుషమ్‌||


తా||    జగత్తు లయం చేసేవాడు, అనంత బలవంతుడు అయిన ఆ దేవదేవుడు గిరిజా సమేతముగా పద్మాసనంలో కూర్చుని యున్నాడు. ఆయనను ధ్యానించినచో..

51.    జ్ఞానంచాప్రతిమం తస్య త్రికాల విషమం భవేత్‌|
        దూరశృతి దూరదృష్టిః స్వేచ్ఛయా స్వర్గతం భజే||

తా||    ఆయనను ధ్యానించినవారు, మూర్తీభవించిన జ్ఞానమూర్తులవుతారు. వారికి త్రికాలములలోని విషయాలు తెలుస్తాయి. దూరశృతి, దూరదర్శనం యొక్క జ్ఞానం కలుగుతాయి. మరియు స్వర్గాది లోకాలను సశరీరంతో వెళ్ళగలిగే యోగ్యత లభిస్తుంది.

52.    సిద్ధానాం దర్శనం చాపి యోగినీ దర్శనం తథా|
        భవేత్‌ ఖేచర సిద్ధశ్చ ఖేచరాణాం జయం తథా||


తా||    సిద్ధుల, యోగుల దర్శనములేగాక, ఖేచరీ మొదలైనవి సిద్ధిస్తాయి. మరియు ఖేచరిని జయించగలుగుతారు.

53.    యో ధ్యాయతి పరం నిత్యం బాణాలింగమద్వితీయకమ్‌|
        ఖేచరీ భూచరీ సిద్ధిర్భవేత్తస్య నసంశయః||

తా||    అద్వితీయ బాణలింగరూప భగవానుని ధ్యానముచే, ఖేచరీ, భూచరీ మొదలైన సిద్ధులు నిస్సంశయముగా సిద్ధిస్తాయి.

54.    ఏతత్‌ ధ్యానస్య మాహాత్మ్యాం కధితుం నైవశక్యతే|
        బ్రహ్మాద్యాః సకలాదేవా గోపాయన్తి పరం త్వదమ్‌||


తా||    ఈ ధ్యానం యొక్క మహాత్మ్యాన్ని బ్రహ్మాది సకల దేవతలకు కూడా చెప్పుటకు శక్యము కానిది. పరమ గోప్యమైనది.

55.    విశుద్ధే షోడశదళే షోడశాక్షర సంయుతే|
        జగత్కారణ కర్తారం జీవాత్మానాం సనాతనమ్‌||

56.    ధ్యానం కరోతి యోనిత్యం స యోగీశ్వర పండితః|
        చతుర్వేదా విభాసన్తే స రహస్యా నిధేరివ||


తా||    పదహారు దళాల, పదహారు అక్షరాల విశుద్ధ కమలములో జగత్కారణకర్త, సనాతనమైన జీవాత్మని యోగీశ్వరులు, పండితులు ఎవరైతే ధ్యానిస్తారో, వారికి నాలుగు వేద నిధుల యొక్క జ్ఞానము లభిస్తుంది.

57.    ఇహస్థానే స్థితో యోగీ యదాక్రోధ వశో భవేత్‌|
        తదా సమస్తం త్రైలోక్యం కమ్యతే నాత్ర సంశయః||


తా||    ఈ స్థానం మీద ధ్యానం చేసే యోగి కోపించినట్లయితే, మూడు లోకాలు మొత్తం కంపించిపోతాయి.

58.    తస్యనక్షయ మాయాతి స్వశరీరస్య శక్తితః|
         సంవత్సర సహస్రేపి వజ్రాతి కఠినస్యవై||


తా||    అటువంటి యోగియొక్క శరీరము, చాలా శక్తివంతమై వజ్రంవలె కఠినమైనదై, వేల సంవత్సరాలననూ నశించకుండా వుంటుంది.

59.    యదాత్యజతి తద్‌ ధ్యానం యోగీంద్రోవని మండలే|
         తదా వర్ష సహస్రాణి మన్యతే తత్‌క్షణం కృతీ||

తా||    వేల సంవత్సరాలు ధ్యాన స్థితిలో (సమాధి) వుండి లేచి అతనికి వేయి సంవత్సరాలు ఒక్క క్షణం వలె అనిపిస్తుంది.

60.    పద్మం ఆజ్ఞాచక్రం భృవోర్మధ్యే హక్షోపేతం దళద్వయ|
         శుక్లాభం తన్మహాకాలం సిద్ధో దేవ్యత్ర హాకినీ||


తా||    దాని తర్వాత రెండు దళాలతో (రెక్కలతో) హం సః క్షరముకాని తెల్లని ప్రకాశముతోగల ఆజ్ఞా కమల రెండు కనుబొమ్మల మధ్య విరాజిల్లుతూ వుంటుంది. యిక్కడ మహాకాల సిద్ధుడు మరియు హాకినీ దేవి వుంటారు.

61.    యం కరోతి సదా ధ్యానం ఆజ్ఞాపదమస్య గోపతమ్‌|
         పూర్వజన్మకృతం కర్మ వినశ్యత్య విరోధతః||


తా||    ఏ వ్యక్తియైతే ఆజ్ఞా కమలమును ధ్యానిస్తాడో, అతనికి పూర్వజన్మపాపములు నశించును.

62.    తదా వద్ధో యధా జీవో కించద్‌ వాంచ్ఛతి శోషతి|
        తదాయో క్షోయదా చిత్తేన శోచతిన వాంచ్ఛతి||


తా||    ఎప్పటివరకూ, ఎంతకాలమైతే యిక్కడ జీవుడు చింతిస్తూ వుంటాడో అప్పటివరకూ (సంసారంలో) బద్ధుడై వుంటాడు. ఎప్పుడైతే విరక్తుడవుతాడో అప్పుడు పూర్తిగా ముక్తిని పొందుతాడు.

63.    బ్రహ్మరంధ్రేహి యత్పదం సహస్రారం వ్యవస్థితమ్‌|
        తత్ర కందే మాయా యోనిస్తస్యాం చంద్రో వ్యవస్థితమ్‌||


తా||    బ్రహ్మరంద్ర ద్వారములో సహస్రదళ కమలము విరాజిల్లుతూ వుండును. అక్కడవున్న కందములోని యోనిలో చందమామ వుంటుంది.

64.    త్రికోణాకార తస్తస్యాః సుధాక్షరతి సతతమ్‌|
        ఇడాయామామృతం తత్ర సమం స్రవతి చంద్రమాః||

తా||    ఇక్కడ త్రికోణాకారము స్థానమున చంద్రుడు ఇడా నాడి యందు ఎప్పుడూ అమృతమును స్రవిస్తూ వుంటాడు.

65.    తధోరన్తరే సహస్రదళపద్మం స్ఫటిక మణిమయ మండన మండిత రత్నఖచిత సింహాసనాసనం, మహాదేవ స్వరూప సదృశం, సహస్ర కోటి సూర్య ప్రకాశం, ధిక్కృత మీన కేతన రూపదర్పం, నిజగురూం, సహస్రవర్ష విలోక నాన్తరమపి చేతోహరం, అనహద వాజం, ఏతాదృశం శిష్యః పశ్యతి|

తా||    అక్కడ సహస్రదళ పద్మములో మణిమయ సింహాసనము మీద శ్రీ మహాదేవ రూపములో గురుదేవులు విరాజమానముగా వుంటారు. ఆయన ప్రకాశము కోటి సూర్యుల కాంతితో సమానముగా వుంటుంది. ఈ దృశ్యాన్ని శిష్యుడు చూస్తాడు.

66.    అస్మిన్‌ స్థానే మనోయస్య క్షణార్ధం వర్తతే అచలమ్‌|
         తస్య సర్వాణి పాపాని నాశమా యాన్తి తత్‌ క్షణాత్‌||


తా||    ఎవరైతే ఈ స్థానములో ఒక్క క్షణమైనా మనస్సులగ్నం చేస్తారో వారి పాపములన్నీ తక్షణమే నాశనము అవుతాయి. యిందులో ఎటువంటి సందేహము లేదు.

67.    న క్షుధాన తృష్ణా నిద్రా శీతోష్ణం న తథైవ చ|
         నమృత్యురర్నాస్తకః కృద్ధో వాధతే తంచ యోగినమ్‌||


తా||    ఆ స్థానమునందు ధ్యానము చేయు యోగికి ఆకలి దప్పులు, శీతోష్ణాలు బాధించవు. మరియు కాలాతీతుడు అవుతాడు. మృత్యువు కూడా ఏమీ చేయలేదు.

68.    గంగా యమున యోర్మధ్యేవ హత్యేషా సరస్వతీ|
         తాసాదు సంగమే స్నాత్వా ధన్యోయాతి పరాంగతిమ్‌||


తా||    ఈ స్థానమునందు గంగ, యమునల మధ్య సరస్వతీ నది ప్రవహిస్తూ వుంటుంది. ఈ సంగమంలో స్నానముచేసే వ్యక్తి పరమగతిని పొందుతున్నాడు.

69.    ఇడా గంగా పురా ప్రోక్తా, పింగళా చార్క పుత్రికా|
         మధ్యా సరస్వతీ ప్రోక్తాతాసాం సంగోతి దుర్లభః||


తా||    ఇడానాడి గంగానది పేరు. పింగళానాడి యమునానది పేరు. సరస్వతీ నది వీటి మధ్యగా ప్రవహిస్తూ వుంటుంది. ఈ మూడింటి సంగమంలో స్నానం చేయుట అతి దుర్లభము.

70.    సితా సితే సంగమే యో మనసా స్నానమాచరేత్‌|
        సర్వపాప వినిర్ముక్తో యాతి బ్రహ్మ సనాతనమ్‌||

తా||    (తెలుపు) శ్వేత మరియు నీల వర్ణములు కలిసిన సంగమములో మానస స్నానము చేసినచో, అన్ని పాపములనుండి విముక్తులై సనాతన పరబ్రహ్మను పొందుతాడు.

71.    త్రివేణ్యాః సంగమే యోవై పితృకర్మ సమాచరేత్‌|
        తారయిత్వా పితృన్‌ సర్వాన్‌ సయాతి పరమాంగతిన్‌||


తా|| ఈ త్రివేణీ సంగమములో ఎవరు పితృతర్పణములు చేస్తున్నారో వారు, తమ పితరులని (తల్లిదండ్రులను) ఉద్ధరించి ముక్తిని పొందుతున్నారు.

72.    అపవిత్రః పవిత్రో బాసర్వావస్థాం గతోపివా|
         స్నానాచరణ మాత్రేణ పూతో భవతి నాన్యధా||


తా||    పవిత్రుడైనా, అపవిత్రుడైనా ఎటువంటి స్థితిలో వున్ననూ, ఈ సంగమములో స్నానం చేసేవాడు, అన్ని విధములుగా పవిత్రుడు అగుచున్నాడు.

73.    మృత్యు కాలేప్లుతం దేహం త్రివేణ్యః సలిలేయదా|
        విచాన్త్య యస్త్యజేత్‌ ప్రాణాన్‌ సతదా మోక్షమాప్నుయాత్‌||


తా||    మృత్యు సమయములో ఎవరైతే త్రివేణీ సంగమమును ధ్యానం చేస్తారో, శరీరాన్ని విడుస్తూ, అట్టివారు తప్పకుండా ముక్తిని పొందుతారు.

74.    నాతః పరతరం గృహ్యం త్రిషు లోకేషు విధ్యతే|
         గోప్తవ్యం తత్‌ ప్రయత్నేన నవ్యాఖ్యేయం కదాచన||


తా||    మూడు లోకాల్లో దీనిని మించిన గూఢమైన (రహస్య) విద్య లేదు. కాబట్టి దీనిని అందరి ఎదుటా బైట పెట్టరాదు.

75.    బ్రహ్మరంధ్రే మనోదత్వా క్షణార్ధం యదితిష్ఠతి|
    సర్వపాప వినిర్ముక్తః సయాతి పరమాంగతిమ్‌||

తా||    బ్రహ్మరంధ్రములో ఏ మనిషైతే మనస్సు పెట్టి, ఒక్క క్షణమైనా ధ్యానములో కూర్చుంటాడో, సర్వ పాపముల నుండి వినిర్ముక్తుడై ముక్తిని పొందుతాడు.
Continue Reading...

Social Share Icons

Blogroll

About